Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా : ఆ సమస్యతో...

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (10:52 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోమారు ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. ఇటీవలే కరోనా వైరస్ బారినపడి కోలుకుని త్వరలోనే ఇంటికి డిశ్చార్జ్ కావాల్సివుంది. ఇంతలోనే ఆయన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. దీనికి కారణంగా ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. 
 
కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన తర్వాత అమిత్ షా గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో రెండు వారాలుగా చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. ఇటీవలే 'తనకు నెగెటివ్‌ వచ్చిందని, ఈశ్వరుడిని కృతజ్ఞతలు' తెలుపుతున్నానని అమిత్ షా ప్రకటన కూడా చేశారు. 
 
అయినప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేవరకు మేదాంత ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలని అనుకున్నారు. అయితే, ఆయన మేదాంత ఆసుపత్రిలో శ్వాసకోశ సమస్యతో పాటు చెస్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండటంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను అక్కడి నుంచి సోమవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌‌కు తరలించారు. ఎయిమ్స్‌లోనే ఇకపై ఆయన చికిత్స తీసుకోనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments