Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి రేట్లు సెంచరీ కొట్టేందుకు వెళ్తుంటే.. దొంగలు అలా ఎత్తుకెళ్లిపోయారు..

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (15:46 IST)
ఉల్లి రేట్లు సెంచరీ కొట్టేందుకు సిద్ధమవుతున్న వేళ ఉల్లిపాయలు చోరీకి గురయ్యాయి. అదీ ఓ రైతు ఇంట్లో నిల్వ చేసిన లక్ష రూపాయల విలువ చేసే ఉల్లిపాయల్ని ఎవరో చోరీ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉల్లిపాయల ఎగుమతికి కేంద్రమైన నాశిక్ జిల్లాలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ప్రమాదకరమైన దొంగలు తయారయ్యారు.. రకరకాల చోరీసు చేస్తూ భయపెడుతున్నారు. 
 
తాజాగా ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో వాళ్ల కళ్లు ఉల్లిపై పడ్డాయి. ఇందులో భాగంగా కల్వాన్ ఊరిలో రైతు రాహుల్ బాజీరావ్... తన ఇంటినే స్టోర్ రూమ్‌గా మార్చుకొని ఉల్లిపాయల్ని జాగ్రత్తగా దాచుకున్నాడు. రోజూలాగే ఇంట్లో వాళ్లంతా ఆదివారం పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచివున్నాయి. అంతే అక్కడ వుంచిన ఉల్లి చోరీకి గురయ్యాయి. 
 
ఈ విషయాన్ని ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేటుగాళ్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే చోరీకి గురైన ఉల్లిని అమ్మేసి వుంటారని.. పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రైతు ఉల్లికి తగిన రేటును ఇచ్చేందుకు గానూ నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను వేగవంతం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments