Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో గెలిపిస్తే మద్యంపై 50 శాతం రాయితీ...

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (11:34 IST)
ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల హామీలను గుప్పిస్తుంటారు. పార్టీలు అయితే వివిధ రకాల ఉచితాలను ఇస్తే.. అభ్యర్థులు కూడా సొంతంగా అది చేస్తాం.. ఇది చేస్తాం అని హామీలిస్తుంటారు. తాజాగా, ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన హామీ ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. 
 
తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిస్తే మద్యంపై 50 శాతం డిస్కాంట్ ఇస్తామని, పండుగల సందర్భంగా ముస్లిం కుటుంబాలకు మేకలను ఉచితంగా ఇస్తామని ఢిల్లీలోని సాంజీ విరాసత్ పార్టీ హామీ ఇచ్చింది. మహిళలకు ఉచితంగా బంగారం అందజేస్తామని తెలిపింది.
 
అలాగే, పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు ఉచితంగా బస్సు, మెట్రో ప్రయాణం, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు మినహాయింపు, ఉచితంగా నిత్యావసరాల పంపిణీ, ఆడపిల్ల పుడితే రూ.50 వేలు, అమ్మాయి పెండ్లికి రూ.2.5 లక్షలు, నిరుద్యోగ భృతి రూ.10000, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ.5000 పింఛన్, ప్రైవేట్ దవాఖానల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు ఇలా పలు హామీలను కురిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments