Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ ఓటర్లకు అఖిలేష్ యాదవ్ 'స్మార్ట్' హామీ... ఓటేయండి.. స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి

దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (05:48 IST)
దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. అపుడు అధికార సమాజ్‌వాదీ పార్టీ వంతు వచ్చింది. దీంతో మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్పీ యువనేత అఖిలేష్ యాదవ్ ఓటర్లను ఆకర్షించుకునే 'స్మార్ట్' హామీ ఇచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన చేశారు. ‘సమాజ్‌వాది స్మార్ట్‌ఫోన్‌ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ప్రజలకు అధునాతన ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లను అందించనున్నారు. ప్రభుత్వ పథకాలు తెలుసుకునేందుకు, పేద ప్రజలను విద్యావంతులు చేసి సమాచారాన్ని ఒకరికొకరు తెలియజెప్పుకునేందుకు సులువుగా ఉంటుందని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 
అన్ని రకాల యాప్స్‌తో పాటు, ఫేస్‌బుక్‌ ఉపయోగించి ప్రభుత్వ పథకాలు ప్రజలు నేరుగా తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తూ 18 సంవత్సరాలు నిండిన ఎవరైన ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబం ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 
 
వచ్చే వారం నుంచి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లను ఆన్‌లైన్‌లో చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నారు. లబ్ధిదారులకు ఈ స్మార్ట్‌ఫోన్లను హోం డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. యువతను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. అయితే స్మార్ట్‌ఫోన్లను 2017 రెండో భాగంలో పంపిణీ చేస్తామని పేర్కొనడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments