Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్ ప్రమోషన్ బోర్డు ఛైర్మన్ గిరి నుంచి జయప్రదకు ఉద్వాసన

యూపీ రాజకీయాలు ఎప్పుడు మలుపులు తిరుగుతాయో చెప్పలేము. తాజాగా వెటరన్ హీరోయిన్, అమర్ సింగ్ అనుచరురాలు జయప్రదను ఫిల్మ్ ప్రమోషన్ బోర్డు ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగిస్తున్నట్టు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదే

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (11:27 IST)
యూపీ రాజకీయాలు ఎప్పుడు మలుపులు తిరుగుతాయో చెప్పలేము. తాజాగా వెటరన్ హీరోయిన్, అమర్ సింగ్ అనుచరురాలు జయప్రదను ఫిల్మ్ ప్రమోషన్ బోర్డు ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగిస్తున్నట్టు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదయం తన అనుచరులతో సమావేశమై నలుగురు మంత్రులను తీసేస్తున్నట్టు చెప్పిన ఆయన, ఆపై జయప్రదకూ ఉద్వాసన పలికినట్టు పేర్కొన్నారు. 
 
రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్‌కు రాజకీయ సన్నిహితురాలిగా ఉన్న జయప్రద ఇటీవలే ఈ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె అమర్ సింగ్ వర్గంలో ఉండటం, తండ్రికి, తనకు మధ్య విభేదాలకు అమర్ సింగ్ కారణమని అఖిలేష్ భావిస్తుండటంతోనే జయప్రదను తొలగించినట్టు సమాచారం. 
 
తాజాగా జరిగిన ఉత్రరప్రదేశ్ రాజకీయ సంక్షోభానికి అమర్ సింగ్ ప్రదాన కారకుడుగా ఉండడంతో ఆయనను దళారి అని సీఎం అఖిలేష్ విమర్శించడంతో రాజకీయ చిచ్చు రాజుకుంది. ఇటువంటి పరిణామాల నేపధ్యంలో జయప్రద పదవి ఊడిపోయిందని వార్తలు వెలువడుతున్నాయి. జయప్రదకు చలనచిత్ర అభివృద్ది సంస్థ ఉపాద్యక్షురాలిగా మంత్రి హోదాలో ఉన్నారు. ఈ సందర్భంగా తానే నేతాజీ (మూలాయం సింగ్ )ఏకైక వారసుడినని కూడా అఖిలేష్ అన్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments