Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క నిమిషమే.. చెప్పేది వినకుండా వెళ్ళిపోయాడు.. అఖిలేష్‌పై పోటీ చేస్తా: ములాయం

యూపీ ఎన్నికల నేపథ్యంలో తండ్రీకుమారులు సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే యూపీ అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ పోరుతో కుమ్ములాట తారాస్థాయికి చేరుకుంది. తన కుమారుడైన, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తీరు మారని

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (17:35 IST)
యూపీ ఎన్నికల నేపథ్యంలో తండ్రీకుమారులు సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే యూపీ అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ పోరుతో కుమ్ములాట తారాస్థాయికి చేరుకుంది. తన కుమారుడైన, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తీరు మారని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఆయనపై పోటీకి దిగుతానని సమాజ్ వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. పార్టీనాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ములాయం అఖిలేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇదిలాఉంటే, అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల పోటీలోకి దిగబోతున్నారని సంకేతాలు కూడా వస్తున్నాయి.
 
ఇంకా ములాయం సింగ్ మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీని, తమ పార్టీ గుర్తును కాపాడుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానని అయితే అఖిలేష్ తన మాటలను లెక్కచేయడం లేదని ఆరోపించారు. అఖిలేష్‌తో చర్చించేందుకు ఇప్పటికే మూడుసార్లు పిలిచానని.. అయితే అఖిలేష్ ఒక్క నిమిషం పాటు మాత్రమే ఉండి.. తాను చెప్పేది వినకుండానే వెళ్లిపోయాడని ములాయం వ్యాఖ్యానించారు. తన కుమారుడు రాష్ట్రంలోని ముస్లింలను రెచ్చగొడుతున్నాడని.. బీజేపీతో పాటు పలు ప్రతిపక్షాలతో చేతులు కలిపాడని ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments