Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లింలు రోజాలో ఉండే రోజుల్లో ఎన్నికలా..? ఏంటిది? అజాం ఖాన్

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (18:42 IST)
దేశంలో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిస్థితుల కారణంగా ముస్లీంలపై మరింత ప్రభావం పడిందని, వారిని కిరాయిదారులుగా చూస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ నేత అజాం ఖాన్ ఆవేదన వ్యక్తం చేసారు. ముస్లింలు రోజాలో ఉండే రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ముస్లీంలను ఓటు వేయకుండా అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలు చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. 
 
ఈ విషయం గురించి మీడియా అజాం ఖాన్ ముందు ప్రస్తావించగా ఆయన సమాధానమిచ్చారు. 'ప్రస్తుతం దేశంలో పరిస్థితి దారుణంగా మారిపోయిందని, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు చేసే ఆగడాల వల్ల ముస్లీంలను ఈ దేశంలో రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని, అంతే కాకుండా కిరాయిదారులుగా పరిగణిస్తున్నారని, ఇది ఎంతమాత్రం సమంజసం అని' ఆవేదన వ్యక్తం చేసారు. 
 
ఎన్నికల తేదీలు మార్చడం మంచిదే అయినప్పటికీ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల కమీషన్ దీనిపై ఒక నోట్ తీసుకుని ఉండాలి. దీంతో ఎన్నికల కమీషన్ రాజకీయ పార్టీ కాదని స్పష్టమైందని చెప్పారు. అయితే రంజాన్ ముస్లీంలకు అతి ముఖ్యమైన పండుగ అని అన్నారు. 
 
వాయుదాడుల గురించి ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హాయాంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయని, అప్పుడు ఎవరూ ఇంతగా మాట్లాడుకోలేదని, ఇప్పుడు రక్తం, శవాలు, తలలతో రాజకీయాలు చేస్తున్నారని, జవానుల జీవితాలతో ఓట్లను సొమ్ము చేసుకునే పనిలో కొందరున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments