Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాసింజర్‌కు పాచిపోయిన ఆహారం.. విమాన సంస్థకు రూ.లక్ష అపరాధం

విమానంలో ప్రయాణం చేసే సమయంలో మనకు ఇచ్చిన ఆహారాన్ని మొత్తం అలాగే తినేస్తాం. చాకోలెట్స్, డ్రింక్స్ ఇలా అన్ని లాగించేస్తాం. కాగా విమానంలో ప్రయాణం చేస్తున్న ఓ ప్రయాణికురాలికి పాడైపోయిన ఆహారం అందించినందుకు

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (14:12 IST)
విమానంలో ప్రయాణం చేసే సమయంలో మనకు ఇచ్చిన ఆహారాన్ని మొత్తం అలాగే తినేస్తాం. చాకోలెట్స్, డ్రింక్స్ ఇలా అన్ని లాగించేస్తాం. కాగా విమానంలో ప్రయాణం చేస్తున్న ఓ ప్రయాణికురాలికి పాడైపోయిన ఆహారం అందించినందుకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఎయిరిండియా యాజమాన్యాన్ని జాతీయ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఆహారం విషయంలో అలసత్వం తగదని, ఇటువంటి పొరబాట్ల వల్ల ప్రయాణికుల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 
 
ఆ వివరాల్లోకి వెళితే... మాలతీ మధుకర్ పహడే అనే మహిళ గత యేడాది ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్లేందుకు ఎయిరిండియా విమానంలో ప్రయాణించింది. ఆసమయంలో తనకు పాచిపోయిన ఆహారం ఇచ్చారని, అన్నంలో వెంట్రుకలు ఉండటంతో పాటు పెరుగు పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోయి ఉందని, దీంతో తాను ఏమీ తినకుండా ప్రయాణించానని వాపోయింది. ఈ విషయమై జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. 
 
ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఎయిరిండియాకు రూ.15 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును ఎయిరిండియా రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో సవాల్ చేసింది. అయితే, రాష్ట్ర ఫోరం ఆ జరిమానాను రూ.లక్షకు పెంచడంతో ఎయిరిండియా మళ్లీ జాతీయ కమిషన్‌లో పిటిషన్ వేసింది. దీనిని కొట్టేసిన జాతీయ కమిషన్ ప్రయాణికురాలికి రూ.లక్ష చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తూ, ఆదేశించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments