ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి... 158 మందికి తప్పిన ప్రాణముప్పు

ఠాగూర్
మంగళవారం, 7 అక్టోబరు 2025 (17:41 IST)
మరో ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కొలంబో నుంచి చెన్నైకు వస్తున్న ఎయిరిండియా విమానాన్ని నింగిలో ఓ పక్షి ఢీకొట్టింది. దీన్ని గమనించని పైలెట్లు విమానాన్ని ఎప్పటిలాగానే సురక్షితంగా చెన్నైలో ల్యాండింగ్ చేశారు. దీంతో ఆ విమానంలోని 158 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
వివరాలను పరిశీలిస్తే, ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 737-800 విమానం మంగళవారం మధ్యాహ్నం కొలంబో నుంచి చెన్నైకు బయలుదేరింది. విమానం చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరిధిలోకి ప్రవేశించిన సమయంలో విమానం గాల్లో ఉండగా ఓ పక్షి ఢీకొట్టింది. అయితే, విమాన ప్రయాణ సమయంలో ఎలాంటి కుదుపులు గానీ సమస్యలు తలెత్తకపోవడంతో పైలెట్లతో పాటు ప్రయాణికులు దీన్ని గమనించలేదు. 
 
విమానం చెన్నైలో ల్యాండింగ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ సిబ్బంది సాధారణ తనిఖీలు చేస్తుండగా పక్షి ఢీకొన్న విషయాన్ని గుర్తించారు. ఈ కారణంగా విమానంలో  స్వల్పంగా సాంకేతిక  సమస్య తలెత్తినట్టు నిర్ధారించారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని తాత్కాలికంగా నిలిపివేసి పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనతో చెన్నై నుంచి కొలంబో వెళ్లాల్సిన విమాన సర్వీసును ఎయిరిండియా రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

Shobitha Dhulipala: క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టి శోభితను పడేసిన నాగచైతన్య

Shilpa Shetty: నటి శిల్పా శెట్టి పై ముంబై పోలీసులు దర్యాప్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments