Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RavindraGaikwad : చెప్పుతో కొడతావా? ఇకపై నిన్ను విమానం ఎక్కనీయం... 'నో ఫ్లై లిస్ట్‌'లో శివసేన ఎంపీ పేరు

ఎయిర్ ఇండియా ఉద్యోగిని పట్ల దురుసుగా ప్రవర్తించి చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై భారత విమానయాన సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఏ) ఆగ్రహం వ్యక్తంచేసింది. గైక్వాడ్‌ పేరును నో ఫ్లై లిస్ట్ (నిషేధిత జా

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (11:59 IST)
ఎయిర్ ఇండియా ఉద్యోగిని పట్ల దురుసుగా ప్రవర్తించి చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై భారత విమానయాన సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఏ) ఆగ్రహం వ్యక్తంచేసింది. గైక్వాడ్‌ పేరును నో ఫ్లై లిస్ట్ (నిషేధిత జాబితా)లో ఉంచింది. దీంతో ఆయన విమానాల్లో ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. కాగా, ఎఫ్.ఐ.ఏలో ఎయిర్ ఇండియాతో పాటు జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌, గోఎయిర్‌ సభ్యులుగా ఉన్నాయి. దీంతో దేశంలో తిరిగే అన్ని సంస్థలకు చెందిన విమానాల్లో ఆయన ప్రయాణం చేయలేని పరిస్థితి నెలకొంది. ఎఫ్‌ఐఏ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు ఇండిగో ప్రెసిడెంట్‌ ఆదిత్య ఘోష్‌ తెలిపారు. 
 
గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో సుకుమార్‌ అనే మేనేజర్‌ను 25 సార్లు చెప్పుతో కొట్టినట్లు రవీంద్ర గైక్వాడ్‌ స్వయంగా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. గైక్వాడ్‌ను నిషేధిత జాబితాలోకి చేర్చామని, నిషేధం ఎంతకాలం ఉంటుందో స్పష్టత లేదని ఎయిరిండియా అధికారి ఓ మీడియా సంస్థకు తెలిపారు. అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులను విమానం ఎక్కకుండా చూసేందుకు పలు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌, భారత ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ నిషేధిత జాబితా పద్ధతిని పాటిస్తున్నాయి. 
 
అయితే తొలిసారిగా ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియా రౌడీ ప్రయాణికులను అడ్డుకునేందుకు నిషేధిత జాబితా ప్రవేశపెట్టింది. బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణం చేయలేకపోయాననే కోపంతో గురువారం దాదాపు 60 ఏళ్ల వయసున్న ఉద్యోగిపై రవీంద్ర గైక్వాడ్‌ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. గైక్వాడ్‌ ఆయనను పదే పదే చెప్పుతో కొట్టడమే కాకుండా కళ్లజోడు పగులగొట్టి, చొక్కా చింపాడు. పైగా ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తానే పాతిక సార్లు చెప్పుతో కొట్టానని, అవసరమైతే మర్డర్ కేసు పెట్టుకోండంటూ తలబిరుసు సమాధానం చెప్పాడు. పైగా ఈ దాడి ఘటనపై తాను క్షమాపణ చెప్పేది లేదని తేల్చిచెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments