Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మహిళలు తిండిలేక చనిపోతున్నారట.. ఎయిమ్స్ పోస్ట్‌మార్టం రిపోర్టులో నమ్మలేని నిజం

దేశ రాజధాని ఢిల్లీలోని మహిళలు తిండిలేక చనిపోతున్నారట. ఈ నిజం దేశంలోనే అత్యున్నత వైద్య విజ్ఞాన సంస్థ అయిన ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన శవపరీక్షల్లో వెల్లడైంది. ఈ ఆస్పత్రిలో మార్చూరీలోని గుర్తుతెలియని మ

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (10:39 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని మహిళలు తిండిలేక చనిపోతున్నారట. ఈ నిజం దేశంలోనే అత్యున్నత వైద్య విజ్ఞాన సంస్థ అయిన ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన శవపరీక్షల్లో వెల్లడైంది. ఈ ఆస్పత్రిలో మార్చూరీలోని గుర్తుతెలియని మహిళల శవాల పోస్టుమార్టంలో ఈ సంచలన విషయాలు వెలుగుచూడగా, ఇవి ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. 
 
దేశం అభివృద్ధిపథంలో పయనిస్తున్న నేటి తరుణంలో కూడు, గూడు లేక మృత్యువాత పడిన అభాగ్య మహిళల బాగోతాలు బట్టబయలయ్యాయి. గుర్తుతెలియని మహిళల్లో ఎక్కువమంది పోషకాహారలోపం వల్ల వచ్చిన పలు వ్యాధులతో మరణించారని వైద్యుల పోస్టుమార్టం నివేదికల్లో తేలింది. 2006 నుంచి 2012వ సంవత్సరం వరకు గుర్తుతెలియని మహిళల శవాల పోస్టుమార్టం చేసిన వైద్యులు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. 
 
మరణించిన గుర్తుతెలియని మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నిమోనియా సమస్యతో బాధపడ్డారని వెల్లడైంది. శీతాకాలంలో కనీసం నివాసముండేందుకు గూడు లేక.. తినేందుకు కూడు లేక వ్యాధుల పాలై మృత్యువాత పడ్డారని తేలింది. నిర్లక్ష్యానికి గురైన నిరుపేద మహిళలు వ్యాధుల పాలైన సరైన వైద్యం అందక మరణించారని తేలింది. పోస్టుమార్టం నివేదికల సారాంశం తాజాగా నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియాలో ఎయిమ్స్ వైద్యులు ప్రచురించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments