Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడ్స్ డే, అహ్మదాబాదులో 555 మందికి ఎయిడ్స్, కానీ సెక్స్ వర్కర్లు ఒక్కరు కూడా లేరు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (12:03 IST)
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 1. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట థీమ్‌పై జరుపుకుంటుండగా, ఈ రోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని "అసమానత అంతం, ఎయిడ్స్ అంతం" అనే థీమ్‌పై జరుపుకుంటున్నారు. ఎయిడ్స్‌ను నిర్మూలించేందుకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రయత్నాలు ప్రారంభించింది.

 
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో హెచ్‌ఐవి కేసులు గణనీయంగా తగ్గాయి. అహ్మదాబాద్ నగరంలో సెక్స్ వర్కర్లు, ట్రక్కర్లు- ట్రాన్స్‌జెండర్లలో ఒక్క HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ ఇన్ఫెక్షన్ మరియు అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియెన్సీ సిండ్రోమ్) కేసు కూడా నివేదించబడలేదు.
 
 
2021లో 555 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. మెహుల్ ఆచార్య మాట్లాడుతూ... 2019-2020లో 2,29,994 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వీరిలో దాదాపు 1400 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

 
2020-2021లో, కరోనా పీరియడ్ ఉన్నప్పటికీ 1,21,611 పరీక్షలు జరిగాయి. వాటిలో 756 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 1,03,902 పరీక్షలు నిర్వహించగా, 555 కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివిటీ రేటు తగ్గిందన్నారు. ఎయిడ్స్ వచ్చినవారిలో ఎక్కువమంది ట్రక్ డ్రైవర్లు వున్నట్లు అధికారి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం