Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త కనిపించడం లేదు: శశికళ పుష్ప ఫిర్యాదు... లింగేశ్వర తిలగన్ అరెస్టు

తన భర్త కనిపించడం లేదంటూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి బుధవారం అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి వెళ్లిన ఈమె భర్త లింగేశ్వర తిలగన్‌పై ఆ పార్టీ శ్రేణ

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (11:53 IST)
తన భర్త కనిపించడం లేదంటూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి బుధవారం అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి వెళ్లిన ఈమె భర్త లింగేశ్వర తిలగన్‌పై ఆ పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా దాడి చేసిన విషయంతెల్సిందే. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాపడ్డారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు రక్షించి... స్థానిక రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. 
 
ఈ దాడి వార్త రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తన భర్త కనిపించడం లేదనీ పేర్కొంటూ శశికళా పుష్ప కోర్టును ఆశ్రయించింది. పార్టీ సర్వసభ్య సమావేశానికి ఒక రోజు ముందు శశికళా పుష్ప తరపున నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన ఆమె భర్తపై అన్నాడీఎంకే కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. 
 
ఇదిలావుండగా, అన్నాడీఎంకే నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శశికళా పుష్ప భర్త లింగేశ్వరన్ తిలగన్‌ను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. తమ పార్టీ కార్యాలయంలోకి హద్దుమీరి ప్రవేశించి, దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను అరెస్టు చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments