Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమాత వడిలోకి జయలలిత.. శిరోమండనంతో అన్నాడీఎంకే ఎంపీ నివాళి

కోట్లాది మందితో అమ్మా అని ముద్దుగా పిలిపించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత భూమాత వడిలోకి చేరి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. కానీ భూమ్మీద ఆమె జ్ఞాపకాలు.. చేసిన పనులు, అమలు చేసిన సంక్షేమ పథకా

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (14:55 IST)
కోట్లాది మందితో అమ్మా అని ముద్దుగా పిలిపించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత భూమాత వడిలోకి చేరి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. కానీ భూమ్మీద ఆమె జ్ఞాపకాలు.. చేసిన పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు మాత్రం ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయాయి. 
 
అందుకే అమ్మలాంటి జయలలిత మరణాన్ని అన్నాడీఎంకే శ్రేణులతో పాటు.. సామాన్య ప్రజలు కూడా తట్టుకోలేక పోతున్నారు. ఫలితంగా మెరీనా బీచ్ వద్ద శోకసంద్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఆమె సమాధి వద్ద రోదిస్తున్న వారిని చూసి రక్షణ కోసం ఉన్న పోలీసులు సైతం కంటతడి పెడుతున్నారు. అభిమానులు తమ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు శిరోముండనం చేయించుకునే సంప్రదాయాన్ని 'అమ్మ' విషయంలోనూ కొనసాగిస్తున్నారు. 
 
అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు సహా పురుషులు, మహిళలు తేడా లేకుండా గుండు గీయించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సెంథిల్ అనంతన్ మాట్లాడుతూ.. ''అమ్మ కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. ఆమె మా కుటుంబం సభ్యుల్లో ఒకరు. మా అందరికీ అమ్మ. అందరికీ అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి'' అని పేర్కొన్నారు. కాగా తమిళనాడు ప్రభుత్వం జయలలిత మృతికి ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments