Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సర్కారుపై టీడీపీ అవిశ్వాస అస్త్రం... అన్నాడీఎంకేలో ముసలం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయోగించిన అవిశ్వాస అస్త్రం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అదేసమయంలో అన్నాడీఎంకేలో ముసలం ఏర్పడింది.

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (10:54 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయోగించిన అవిశ్వాస అస్త్రం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అదేసమయంలో అన్నాడీఎంకేలో ముసలం ఏర్పడింది. 
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ఆ పార్టీ సీనియర్‌ నేత, అధికార ప్రతినిధి కేసీ పళనిస్వామి ప్రకటించారు. కావేరి మండలి ఏర్పాటుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఈపరిస్థితుల్లో.. టీడీపీ ముందుకుతెచ్చిన అవిశ్వాస తీర్మానానికి అన్నాడీఎంకే మద్దతివ్వక తప్పదని వ్యాఖ్యానించారు. 
 
దీంతో ఖంగుతిన్న ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీ పళనిస్వామిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే తనపై వేటు వేయడాన్ని కేసీ పళనిస్వామి గర్హించారు. 
 
ముఖ్యమంత్రి ఈపీఎస్‌, ఉపముఖ్యమంత్రి ఓపీఎస్‌ల బండారం శనివారం బయటపెడతానని హెచ్చరించారు. పార్టీలో చీలిక రాబోతుందంటూ.. అధికార పక్షంలో కలకలం రేపారు. నిజానికి, కేసీ పళనిస్వామి అన్నాడీఎంకేలో సీనియర్‌ నాయకుడు. ఎంజీఆర్‌ హయాం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments