Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రెండాకుల గుర్తుపై ఈసీ నిర్ణయం.. శశికళ - పన్నీర్ వర్గాల్లో మొదలైన గుబులు

తమిళనాడు రాష్ట్ర అధికార అన్నాడీఎంకే అధికారిక ఎన్నికల గుర్తు రెండాకుల చిహ్నంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ గుర్తును ఏ వర్గానికి కేటాయిస్తారోనన్న అంశంపై నెలకొనివున్న ఉత్కంఠతకు తెరపడన

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (09:41 IST)
తమిళనాడు రాష్ట్ర అధికార అన్నాడీఎంకే అధికారిక ఎన్నికల గుర్తు రెండాకుల చిహ్నంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ గుర్తును ఏ వర్గానికి కేటాయిస్తారోనన్న అంశంపై నెలకొనివున్న ఉత్కంఠతకు తెరపడనుంది. దీంతో ఇటు శశికళ, అటు పన్నీర్ సెల్వం వర్గాల్లో గుబులు మొదలైంది.
 
ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభం మొదలైన విషయం తెల్సిందే. జయలలిత నమ్మినబంటు పన్నీర్ సెల్వం, జయ ప్రియనెచ్చెలి శశికళల మధ్య వైరం మొదలై... పార్టీ రెండుగా చీలిపోయింది. అదేసమయంలో ఆ పార్టీ ఎన్నికల గుర్తు రెండాకుల చిహ్నం కోసం పన్నీర్, శశికళ వర్గీయులు పట్టుబడుతున్నారు. దీంతో ఎన్నికల గుర్తు రెండాకులను ఎవరికి కేటాయించాలన్న దానిపై బుధవారం సీఈసీ నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఇప్పుడు తమిళనాడు సహా దేశవ్యాప్తంగా అందరి చూపు సీఈసీ వైపు మళ్లింది. 
 
జయలలిత నెచ్చెలి శశికళ చేతికి ప్రభుత్వం చిక్కడంతో కనీసం రెండాకుల గుర్తునైనా తాను దక్కించుకోవాలని పన్నీర్ సెల్వం పట్టుదలగా ఉన్నారు. ఇందుకుసంబంధించిన వ్యూహ, ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. ఈ గుర్తు కోసం తమ వద్ద ఉన్న ఆధారాలను, రికార్డులను పన్నీర్ వర్గం ఇప్పటికే ఈసీకి సమర్పించింది. అలాగే, చిన్నమ్మ శిబిరం కూడా ఈ విషయంలో సీఈసీకి వివరణలు ఇచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments