Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

ఠాగూర్
ఆదివారం, 15 జూన్ 2025 (16:04 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఈ నెల 12వ తేదీన జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా బయటపడ్డాడు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల మృతదేహాలను గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో మృతుల కుటుంబ సభ్యుల డీఎన్ఏ శాంపిల్స్‌ను సేకరించి మృతదేహాలను గుర్తిస్తున్నారు. 
 
ఈ విమాన ప్రమాద మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మృతదేహాన్ని గుర్తించనట్టు ఆ రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సింఘ్వీ వెల్లడించారు. రూపానీ కుటుంబ సభ్యులు నమూనాలతో మృతదేహం డీఎన్ఏ సరిపోలిందన్నారు. దీంతో భౌతికకాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. 
 
కాగా, ఇప్పటివరకు 32 మంది మృతుల డీఎన్ఏ వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్టు బీజే వైద్య కాలేజీ సీనియర్ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు. డీఎన్ఏ పరీక్ష నిర్వహించి, ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. పరీక్షతో పనిలేకుండా బంధువుల గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు ఇచ్చామన్నారు. 
 
ప్రమాద తీవ్ర వల్ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండటం వల్ల డీఎన్ఏ టెస్టులు ఆలస్యం అవుతోందన్నారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన 11 మంది విదేశీయులు కుటుంబాలను ఇప్పటికే సంప్రదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments