Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగ పోస్టుల భర్తీలో రైల్వే శాఖ కీలక నిర్ణయం... వేలాది మందికి లబ్ది

వరుణ్
బుధవారం, 31 జనవరి 2024 (17:06 IST)
రైల్వే శాఖ చేపట్టనున్న అసిస్టెంట్ లోకో పైలెట్ (ఏఎల్పీ) ఉద్యోగాల భర్తీకి వయో పరిమితిలో రైల్వే శాఖ కీలక మార్పు చేసింది. ఇటీవల వెల్లడైన నోటిఫికేషన్‌లో ఏకంగా 5,600 లోకో పైలెట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులకు ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ వయోపరిమితిలో కీలక మార్పు చేసింది. 
 
గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో అభ్యర్థు వయోపరిమితి 18 నుంసి 30 యేళ్లుగా పోర్కొన్నారు. ఇపుడు గరిష్ట వయోపరిమితిని 33 యేళ్లకు పెంచారు. అలాగే, దరఖాస్తు చేసుకునేవారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. 
 
పరీక్షల టైం లైన్‌ను పరిశీలిస్తే...
 
కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ ఆగస్టు నెలల మధ్య జరిగే అవకాశం ఉంది. రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సెప్టెంబరు నిర్వహించే వీలుదుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్ నవంబరు నెలలో నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను నవంబరు డిసెంబరు నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. మరిన్ని ఏఎల్‌పీ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్‌ను వచ్చే యేడాది జనవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments