భాజపాకు మరో మిత్రపక్షం టాటా...

భారతీయ జనతా పార్టీ చేజేతులా కష్టాలు కొనితెచ్చుకునేలా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన భాగస్వామ్య పార్టీలన్నీ ఒక్కొక్కటిగా పారిపోతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో బలమైన మిత్రపక్షంగా ఉన్న శివసేన టాటా చెప్ప

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (16:33 IST)
భారతీయ జనతా పార్టీ చేజేతులా కష్టాలు కొనితెచ్చుకునేలా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన భాగస్వామ్య పార్టీలన్నీ ఒక్కొక్కటిగా పారిపోతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో బలమైన మిత్రపక్షంగా ఉన్న శివసేన టాటా చెప్పగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. 
 
ఇంతలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి తేరుకోలేని షాకిచ్చారు. ముఖ్యంగా, యూపీలో కంచుకోటగా భావించే గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి తన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ ఫలితాలను చూసిన బీజేపీ మిత్రపక్షాలు చడీచప్పుడు కాకుండా జారుకుంటున్నాయి. 
 
ఇందులోభాగంగా కేరళకు చెందిన ఎన్డీయే మిత్రపక్షం భారత్ ధర్మ జన సేన(బీడీజేఎస్) టాటా చెప్పేసింది. కొద్దిరోజులుగా ఎన్డీఏ నుంచి వైదొలగాలా.. వద్దా అన్న అంశంపై మీమాంసలో ఉన్న బీడీజేఎస్.. యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో పొత్తు తెంచుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. బుధవారం ఈమేరకు పార్టీ నేతలు సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో కేరళలో ఉన్న ఒకే ఒక్క మిత్రపక్ష పార్టీని ఎన్డీఏ (బీజేపీ) కోల్పోయినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments