Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవాణా శాఖ మాజీ ఉద్యోగికి 383 యేళ్ల జైలుశిక్ష .. ఎక్కడ?

Webdunia
సోమవారం, 31 జులై 2023 (13:46 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చేరన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌లో జరిగిన ఓ మోసంతో నకిలీ పత్రాల మోసం కేసులో దోషిగా తేలిన ఆ సంస్థకు చెందిన ఓ వ్యక్తికి కోర్టు 383 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
అలాగే, రూ.3.32 కోట్ల జరిమానా విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వ రవాణా సంస్థ కోయంబత్తూరు డివిజన్‌లో బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ గత 1988లో నవంబరు ఎనిమిదో తేదీన ఒక కేసు నమోదైంది. 
 
నకిలీ పత్రాలతో 47 బస్సులను విక్రయించి రూ.28 లక్షల మోసం చేశారంటూ ఎనిమిది మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోదండపాణి, రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దురైస్వామి, రంగనాథన్, రాజేంద్రన్‌లను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో కోర్టులో విచారణ సాగుతూ వస్తుంది. ఈ క్రమంలో కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నటరాజన్, రామచంద్రన్, రంగనాథన్, రాజేంద్రన్‌లు చనిపోయారు.
 
మరోవైపు జీవించివున్నవారిలో కోదండపాణి మినహా మిగిలిన ముగ్గురినీ జడ్జి నిర్దోషులుగా పేర్కొనగా, ఆర్టీసీ సంస్థను మోసం చేసినందుకు కోదండపాణికి 47 నేరాల కింద నాలుగేళ్ల చొప్పున 188 యేళ్లు, 47 ఫోర్జరీ నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 యేళ్ళు ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. ఈ మూడు శిక్షలను కలిపితే మొత్తం 383 సంపత్సరాల శిక్ష అవుతుంది. ప్రస్తుతం కోదండపాణి వయసు 82 సంవత్సరాలు. కోర్టు తీర్పు నేపథ్యంలో ముద్దాయిని పోలీసులు జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments