Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.. ఈడొచ్చిన అమ్మాయి నచ్చిన వాడితో ఎక్కడైనా..?

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (22:32 IST)
ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. మేజర్ అయిన అమ్మాయి తనకు నచ్చిన వాడితో ఎక్కడైనా ఉండొచ్చంటూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. 20 ఏళ్ల యువతి తన ప్రియుడిని వివాహం చేసుకునేందుకు తన ఇంటిని వదిలి వెళ్లిపోయిన ఓ కేసులో.. జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రజ్నీశ్ భట్నాగర్‌ ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. 
 
వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 12న సులేఖ అనే యువతి తన ప్రియుడు బబ్లూతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అయితే తన చెల్లెలు కిడ్నాప్‌కి గురైందంటూ ఆమె అన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. బబ్లూ అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉందని కూడా సదరు పిటిషన్‌లో పేర్కొన్నాడు.
 
దీంతో ఢిల్లీ పోలీసుల ద్వారా సులేఖ జాడ కనిపెట్టిన ధర్మాసనం.. ఆ యువతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. అయితే తన ఇష్ట ప్రకారమే బబ్లూను వివాహం చేసుకునేందుకు వెళ్లానంటూ సులేఖ కోర్టుకు వివరించింది. దీంతో సులేఖకు ఇష్టమైతే తాను కోరుకున్నవాడితోనే ఉండవచ్చునంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమె కుటుంబ సభ్యులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదనీ... సులేఖ సోదరుడికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments