Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ శిశువుకు జన్మనిచ్చింది.. ఆస్పత్రిలో అత్యాచారానికి గురైంది.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (13:25 IST)
ఢిల్లీలో నిర్భయ ఘటనకు తర్వాత కూడా దారుణాతి దారుణమైన ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన మళ్లీ ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ శిశువుకు జన్మనిచ్చిన గంటల వ్యవధిలోనే ఓ మహిళ అత్యాచారానికి గురైంది. డీఎస్పీ సురేష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ పోలీసు అధికారి భార్య నెలలు నిండి, హర్యానాలోని ఝాజ్జర్ జిల్లా పరిధిలోని ఆసుపత్రిలో ప్రసవం కోసం చేసింది. 
 
వైద్యులు సిజేరియన్ చేయడం ద్వారా ఓ పాప జన్మించింది. అనంతరం ఆమెను ఐసీయూలో చేర్చగా, వైద్యుడి దుస్తుల్లో ఉన్న ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఒంటిగంటకు ఆమెకు సిజేరియన్ జరిగింది. అయితే ఉదయం 3:20 గంటల సమయంలో ఈ దురదృష్టకర ఘటన జరిగిందని డీఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు. అనంతరం ఐసీయూ నుంచి ఓ వైద్యుడి దుస్తుల్లో ఉన్న నిందితుడు బయటకు రావడం సీసీ కెమెరాల్లో రికార్డయిందని వివరించారు. 
 
కాగా, ఇదే వ్యక్తి, అదే రహదారిలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ నంటూ మరో యువతి దగ్గరకు వెళ్లాడు. అతని చేష్టలు, అభ్యంతరకర తీరు, తనను తాకుతున్న విధానాన్ని గమనించిన ఆమె కేకలు వేయగా, అక్కడి నుంచి పారిపోయాడని సురేష్ కుమార్ వివరించారు. అన్ని సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నామని, ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని సురేష్ కుమార్ తెలిపారు,  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments