Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు ఆర్‌కే నగర్ బరిలో "పందెం కోడి"

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్.కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొంది.

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (21:13 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్.కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొంది. 
 
ఈ ఎన్నికల్లో హీరో విశాల్ పోటీ చేస్తున్నారు. పలు నాటకీయ పరిణామాల మధ్య ఆయన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల సంఘం తొలుత తిరస్కరించగా, ఆ తర్వాత ఆమోదించింది. 
 
అదేసమయంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. అఫిడవిట్‌లో లోపాల కారణంగా దీపా జయకుమార్‌ నామినేషన్‌ తిరస్కరించామని ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
దీంతో ప్రస్తుతం ఉప ఎన్నికల బరిలో విశాల్‌తో పాటు అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌, డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్‌, భాజపా అభ్యర్థిగా నాగరాజన్‌, ఏఐడీఏడీఎంకే బహిష్కృత నేత టిటివి దినకరన్‌ ప్రస్తుతం బరిలో ఉన్నారు. దీంతో పంచముఖ పోటీ నెలకొంది. 
 
ఇదిలావుండగా, తన నామినేషన్‌ తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ సినీనటుడు విశాల్‌ ఆర్కేనగర్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఉద్దేశ పూర్వకంగానే తన నామినేషన్‌ తిరస్కరించారని, దీని వెనుక కుట్ర ఉందని విశాల్‌ ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే ఆయన నామినేషన్‌ను ఈసీ ఆమోదించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments