Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లి కణతకు తుపాకీ గురిపెట్టి వేధింపులు... ప్రతిఘటించడంతో యువతి ముఖంపై యాసిడ్

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (17:23 IST)
బీహార్‌లో కొందరు కామాంధులు రెచ్చిపోయారు. ఓ తల్లి కళ్ళెదుటే ఆమె కుమార్తెపై లైంగికదాడికి యత్నించారు. కన్నతల్లి కణతపై తుపాకీ గురిపెట్టి.. ఆమె కుమార్తెను వేధించారు. చివరకు ఆ యువతి ప్రతిఘటించడంతో ఏం చేయలేని దుండగులు... ఆ యువతి ముఖంపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు.
 
ఈ దారుణం శుక్రవారం రాత్రి బీహార్ రాష్ట్రంలోని భాగల్పూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భాగల్పూరుకు చెందిన 17 యేళ్ళ యువతి కన్నతల్లితో కలిసి నివసిస్తోంది. స్థానికంగా ఉండే ఓ కాలేజీలో 11వ తరగతి చదువుతోంది. ఆ యువతిపై అదే ప్రాంతానికి ప్రిన్స్ అనే వ్యక్తి ఆ యువతిపై కన్నేశాడు. ఈ క్రమంలో ఆ యువతిని పలుమార్లు వేధించాడు కూడా. అయినప్పటికీ ఆ యువతి మాత్రం లొంగలేదు.
 
దీంతో శుక్రవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులను ఇంటికి పిలిపించి... యువతి ఇంట్లోకి చొరబడి ఆమెను లైంగికంగా వేధించారు. అడ్డొచ్చిన తల్లిపై కూడా దాడి చేశారు. ఆమె కణతపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు. అరిస్తే తుపాకీతో కాల్చిచంపేస్తానని బెదిరించాడు. అనంతరం వేధింపులను కొనసాగించాడు. అయితే ప్రిన్స్ వేధింపులను యువతి ప్రతిఘటించడంతో నిందితులు రెచ్చిపోయారు.
 
తమ వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను యువతి ముఖంపై పోసి పరారయ్యారు. యాసిడ్ మంట తాళలేక యువతి కేకలు వేయడంతో స్థానికులు, ఇరుగుపొరుగు వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలంలో యాసిడ్ బాటిల్‌తో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు ప్రిన్స్‌ను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం