Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభినందన్ అంటే ఇపుడు అర్థం వేరు : ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (14:44 IST)
ఇటీవల శత్రుసైన్యం చెర నుంచి విముక్తి పొందిన అభినందన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు ప్రశంసల వర్షం కురిపించరు. అభినందన్ అనే పదానికి ఇపుడు అర్థం మారిందన్నారు. నిజానికి అభినందన్ అంటే కృతజ్ఞత అని ఇపుడు ఆ పదానికి అర్థం మారిపోయిందన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం భారత్ ఏం చేస్తున్నదనే విషయాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని, నిఘంటువు (డిక్షనరీ)లోని పదాలకు భారత్ సరికొత్త అర్థాన్ని తీసుకురాగలదన్న విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. 
 
పాక్ చెర నుంచి అభినందన్ విడుదలైన మరుసటి రోజే మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్ ఏం చేస్తుందోననే విషయాన్ని ప్రపంచం గమనిస్తోంది. నిఘంటువులో ఉన్న పదాలకు అర్థాలు మార్చడం భారత్‌కే సాధ్యం. కృతజ్ఞతలు తెలిపే క్రమంలో అభినందన్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు అభినందన్ పదానికి అర్థమే మారిపోయింది. ఇది భారత్ సత్తాకు నిదర్శనమన్నారు.
 
పాకిస్థాన్ గడ్డపై నుంచి భారత గడ్డపైకి అభినందన్ అడుగుపెట్టగానే ప్రధాని నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. అందులో... "వింగ్ కమాండర్ అభినందన్ మాతృభూమికి స్వాగతం. మీ అసమాన ధైర్యసాహసాలతో జాతి గర్విస్తున్నది" అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments