ఆరుషి హత్య కేసు : తల్వార్ దంపతులు విడుదల

కన్నబిడ్డ ఆరుషి, పనిమనిషి హేమరాజ్ హత్య కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తూ వచ్చిన తల్వార్ దంపతులు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. ఈ కేసులో రాజేష్, నూపుర్ తల్వార్‌ దంపతులు గత 2013 నుంచి దాస్నా జైలుల

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (05:47 IST)
కన్నబిడ్డ ఆరుషి, పనిమనిషి హేమరాజ్ హత్య కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తూ వచ్చిన తల్వార్ దంపతులు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. ఈ కేసులో రాజేష్, నూపుర్ తల్వార్‌ దంపతులు గత 2013 నుంచి దాస్నా జైలులోనే గడుపుతూ వచ్చారు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని దస్నా జైలు నుంచి విడుదలయ్యారు. 
 
ఈ సందర్భంగా జైలు వెలుపల పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నాలుగేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన తల్వార్ దంపతులు తమ లగేజీతో సహా నడుచుకుంటూ బయటకు వచ్చారు. వారిని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు, మీడియా అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని కారులో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.
 
ఆరుషి హత్య కేసులో నూపూర్, రాజేష్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు ఈనెల 12న సంచలన తీర్పునిచ్చింది. వారిని జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసిన అధికారులు.. సోమవారం సాయంత్రం వారిని జైలు నుంచి విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments