Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందీప్ కుమార్ ఓ ''కుళ్ళిపోయిన చేప''.. అగ్నిపరీక్షకు కూడా సిద్ధమంటోన్న రాసలీలల మంత్రి

అక్రమ సంబంధం, రాసకేళీతో దొరికిపోయి మంత్రి పదవిని పోగొట్టుకున్న సందీప్ కుమార్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చుక్కలు చూపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇప్పటికే సందీప్ కుమార్‌ను బహిష్కరించారు. శ

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (14:45 IST)
అక్రమ సంబంధం, రాసకేళీతో దొరికిపోయి మంత్రి పదవిని పోగొట్టుకున్న సందీప్ కుమార్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చుక్కలు చూపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇప్పటికే సందీప్ కుమార్‌ను బహిష్కరించారు. శనివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన చేశారు. పార్టీ పరువు తీసిన సందీప్ కుమార్‌ను ఓ ''కుళ్లిన చేప''గా విమర్శించారు.
 
ఓ మహిళతో సందీప్ రాసలీలలో పాల్గొన్న వీడియోలను ఓ ఛానల్ ప్రసారం చేసిన నేపథ్యంలో మంత్రి పదవి నుంచి కేజ్రీవాల్ తొలగించారు. అయితే ఆ టేపుల్లో ఉన్నది తాను కాదని, దళితుణ్ని అయినందుకే తనును ఇరికించారంటూ సందీప్ వ్యాఖ్యానిస్తున్నారు. 
 
అంబేద్కర్ విగ్రహాన్ని తన ఇంటి ముందు ఉంచుకున్నందుకే తనపై ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని.. ఈ వ్యవహారంపై అగ్ని పరీక్షకైనా సిద్ధమని సందీప్ కుమార్ అంటున్నారు. అయితే కేజ్రీవాల్ సందీప్ కుమార్ వ్యాఖ్యల్ని ఏమాత్రం పట్టించుకోకుండా సందీప్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. పార్టీ నుంచి బహిష్కరించారు.
 
ఇదిలా ఉంటే.. ఢిల్లీ హైకోర్టుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. మొన్న కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు బాగు చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని హైకోర్టు కేజ్రీవాల్ సర్కారుపై మండిపడింది. 
 
అయితే హైకోర్టు వ్యాఖ్యలకు కేజ్రీవాల్ ధీటుగా సమాధానం చెప్పారు. ఒకవైపు పరిపాలనా పరమైన నిర్ణయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌దే తుది నిర్ణయమని చెప్తున్న హైకోర్టు, వర్షం వల్ల నిలిచిపోయిన నీళ్లు, రహదారుల మరమ్మత్తుపై కూడా ఆయన్నే అడగాలని సూచించారు.
 
''హైకోర్టు ఎప్పుడైతే లెఫ్టినెంట్ గవర్నరే ప్రభుత్వం అని చెప్పిందో రాష్ట్రంలో తలెత్తిన లోపాలపై కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌నే ప్రశ్నించాలి" అని కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో అభిప్రాయపడ్డారు. లెఫ్టినెంట్ గవర్నరే సమస్తమని చెప్పే హైకోర్టు సీఎంను నిలదీయడం ఆక్షేపనీయమని కేజ్రీవాల్ అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments