Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

ఠాగూర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (16:28 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ మరో ఉచిత హామీని ప్రకటించింది. ఢిల్లీలోని సీనియర్ సిటిజన్లందరికీ అన్ని ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 యేళ్లు దాటిన వృద్ధులందరికీ ఉచిత వైద్యం అందించేలా సంజీవని యోజన అనే పథకాన్ని అమలు చేస్తామని ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. 
 
'వయో వృద్ధుల సంరక్షణ మా బాధ్యత. మీరెంతో కష్టపడి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకొచ్చారు' అన్నారు. సీనియర్‌ సిటిజన్లు అనారోగ్యానికి గురైతే వారి చికిత్సకు అయ్యే ఖర్చుకు గరిష్ఠ పరిమితి ఏమీ ఉండదని కేజ్రీవాల్‌ తెలిపారు. 
 
దీనిపై ఒకట్రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలవుతుందని.. ఆప్‌ కార్యకర్తలే ఇళ్లకు వచ్చి రిజిస్ట్రేషన్‌ చేస్తారన్నారు. వారు ఇచ్చే కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే.. ఈ ఉచిత చికిత్స విధానాన్ని అమలు చేస్తామన్నారు. 
 
మరోవైపు, ఢిల్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ వారంలోనే సమావేశం నిర్వహించనుంది. ఈ క్రమంలో త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆప్‌ 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆప్‌ చీఫ్ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ నుంచి పోటీ చేయనున్నారు.. సీఎం ఆతిశీ కల్కాజీ సీటు నుంచి బరిలో నిలవనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత షాకింగ్ లుక్, ఏంటి బ్రో ఇలా అయ్యింది? (video)

బచ్చల మల్లి సక్సెస్ తో ఈ ఏడాది ముగింపు బాగుండాలి : అల్లరి నరేష్

నిధి కోసం వేటతో సాగే కథనమే నాగన్న మూవీ

ప్రభుత్వానికి చిత్రపరిశ్రమకు వారధిగా పని చేస్తా : డీఎఫ్‌‍డీసీ చైర్మన్ దిల్ రాజు

నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో హిట్: ద తార్డ్ కేస్ కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments