Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీ శరీరాన్ని ప్రేమించుకోవడం ఆపేయ్. నాతో రాజీపడు... పైకి ఎదుగుతావ్'.. ఆప్ నేత వేధింపులు!

'నీ శరీరాన్ని ప్రేమించుకోవడం ఆపేయ్. నాతో శారీరకంగా రాజీపడు... పైకి ఎదుగుతావ్'.. ఇవి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా కార్యకర్తకు అదే పార్టీకి చెందిన నేత పెట్టిన లైంగిక వేధింపులు.

Webdunia
గురువారం, 28 జులై 2016 (16:48 IST)
'నీ శరీరాన్ని ప్రేమించుకోవడం ఆపేయ్. నాతో శారీరకంగా రాజీపడు... పైకి ఎదుగుతావ్'.. ఇవి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా కార్యకర్తకు అదే పార్టీకి చెందిన నేత పెట్టిన లైంగిక వేధింపులు. పార్టీలో ఉన్నత స్థాయికి రావాలంటే... రాజీపడాల్సి ఉంటుందని, అపుడే అన్ని విధాలుగా రాణిస్తావంటూ ఆమెను నిత్యం వేధిస్తూ వచ్చాడు. దీంతో ఆ కార్యకర్త ఈ వేధింపులను తాళలేక ఆత్మహత్య చేసుకుంది. 
 
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో తనతోపాటు పనిచేసే కార్యకర్త రమేశ్ వాద్వా వేధింపులు భరించలేక ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన న్యూఢిల్లీలోని నెరెల ప్రాంతంలో చోటుచేసుకుంది. వేధింపులకు గురిచేసిన అతడు జైలుకు వెళ్లి అనంతరం బెయిల్‌పై విడుదల కావడంతోపాటు స్వేచ్ఛగా బయటకు వచ్చాక ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఆ మహిళ కార్యకర్త బలవన్మరణానికి పాల్పడింది. 
 
ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యులు విచారణ చేపట్టారు. ఇందులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. వేధింపులకు దిగిన ఆ వ్యక్తి ఆ మహిళా కార్యకర్తను 'నీ శరీరాన్ని ప్రేమించుకోవడం ఆపేయ్. రాజీపడు. అలా చేయకుంటే నువ్వు పార్టీలో ఎదగడం జరగదు' అని బెదిరించాడు. అంతేనా.. ఆమె ఇద్దరు కుమార్తెలను కూడా కిడ్నాప్ చేస్తానని బెదిరించాడట. 
 
అంతేకాదు, ఆమె ఇద్దరు పిల్లల అడ్మిషన్లను కూడా ఆయన రద్దు చేయించాడు. దీంతో ఆ పిల్లు బడికెళ్లడం మానేశారు. ఈ పర్యవసనాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ మహిళా కమిషన్ సభ్యులు చెపుతున్నారు. ఈ ఆత్మహత్యపై మున్ముందు ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం