Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లాడింది... కానీ అతడి నుంచి దాన్ని తట్టుకోలేక విడాకులు కోరింది...

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (15:56 IST)
ప్రేమించేటపుడు ఆమెకి అంతగా దాని గురించి తెలయలేదు. కానీ పెళ్లయ్యాక బాగా తెలిసింది. ఎందుకంటే రాత్రివేళ పడకగదికి చేరాక ఆమె పరిస్థితి దారుణంగా మారిపోయేది. కారణం... అతడి శరీరం నుంచి వచ్చే దుర్వాసన... అదేనండీ చెమట వాసన. దాన్ని భరించలేక అతడి నుంచి విడాకులు కోరింది ఓ యువతి. 
 
అసలు విషయానికి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో బ్రాహ్మణ వర్గానికి చెందిన యువతి సింధీ వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకున్న తర్వాత అతడి ప్రవర్తన చూసి షాక్ తిన్నది. ఆమె అలవాట్లకు ఇతడి అలవాట్లకు పొంతన లేకుండా పోయింది. దాంతో చాలాసార్లు ఇద్దరి మధ్య వాగ్వాదాలు చెలరేగేవి.
 
ఇవన్నీ ఇలావుంటే కట్టుకున్న భర్త ఉద్యోగం బిజీ అంటూ ఒక్కోసారి వారం పాటు స్నానం చేయడు. అలాగే రాత్రిపూట భార్యతో సంసారం అంటూ ఒత్తిడి పెట్టేవాడు. వీటన్నిటినీ భరించలేని యువతి తనకు విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కింది. షేవింగ్ చేసుకోకుండా, స్నానం చేయకుండా ఇతడితో సంసారం చేయడం తనవల్ల కాదని విడాకుల పత్రంలో పేర్కొంది. ఐతే భార్యాభర్తల వాదోపవాదాలు విన్న కోర్టు వారికి కౌన్సిలింగ్ ఇచ్చింది. భర్తకు కూడా శుభ్రత గురించి విడమరిచి చెప్పింది. పరిస్థితి ఇలాగే వుంటే ఆరు నెలల తర్వాత తిరిగి నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి పంపేసింది. మరి అతడిలో మార్పు వస్తుందో లేదో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments