Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిసార్టులో ఎంజాయ్ చేయడానికి వచ్చి శవాలై తేలిన టెక్కీ కుటుంబం

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (18:28 IST)
మధ్యప్రదేశ్ నగరం ఇండోర్, ఖుడైల్ లోని క్రెసెంట్ వాటర్ పార్క్‌లోని అపోలో డిబి సిటీలో నివశిస్తున్న ఒక ఇంజనీర్, అతని భార్యతో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. నలుగురూ విషపూరిత వస్తువులను తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారని ప్రాధమికంగా వెల్లడైంది. క్రెసెంట్ వాటర్ పార్కులో ఒక రిసార్ట్ ఉంది. ఇక్కడ అతిథులు కూడా అద్దెకు గదులు తీసుకుంటారు. 
 
డిబి సిటీలో నివసిస్తున్న అభిషేక్ సక్సేనా (45) ఒక రోజు ముందు గదిని అద్దెకు తీసుకున్నాడు. గురువారం కుటుంబ సభ్యులు గది నుండి బయటకు రాకపోవడంతో, రిసార్ట్ సిబ్బందికి అనుమానం వచ్చి తలుపు కొట్టారు. కానీ ఎంతకీ తలుపులు తీయకపోవడంతో మాస్టర్ కీ ఉపయోగించి తలుపులు తెరిచినప్పుడు గది లోపల నలుగురు విగతజీవులుగా కనబడ్డారు.
 
దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతులను అభిషేక్ సక్సేనా(45), అతని భార్య ప్రీతి సక్సేనా (42), కుమారుడు అద్వైత్ (14), కుమార్తె అనన్య(14) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నలుగురి శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఒక విషపూరిత రసాయనం సమీపంలో కనబడింది. వారంతా ఈ రసాయనాన్ని తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కాగా వారి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments