Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహమైన గంటలోపే భార్యకు విడాకులు.. ఆ తర్వాత తమ్ముడికిచ్చి పెళ్లి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (07:22 IST)
సాధారణంగా వివాహం అంటే నూరేళ్ళ పంట అన్నారు మన పెద్దలు. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంభాల్ జిల్లాలో పెళ్లి అయిన గంటకే ఓ జంట విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమెను తన తమ్ముడికిచ్చి పెళ్లి చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయి ఖుర్ద్ గ్రామంలో ఓ జంటకు పెళ్లి జరిగింది. పెళ్లికొచ్చిన వారంతా ఆనందోత్సవాల్లో మునిగితేలుతున్నారు. ఆ సమయంలో ఓ అనుకోని అతిథి మండపానికి వచ్చింది. దీంతో అక్కడ సమస్య మొదలైంది. ఆ అతిథి ఎవరో కాదు.. పెళ్లి కుమారుడు మొదటి భార్య.
 
తాను జీవించివుండగా, రెండో పెళ్లి ఎలా చేసుకుంటావు అని భర్తతో గొడవకు దిగింది. గొడవ పెద్దది కావడంతో గ్రామపెద్దలు అక్కడికి చేరారు. మరోవైపు, భార్యకు నచ్చజెప్పేందుకు పెళ్లి కొడుకు వేషధారణలో ఉన్న భర్త ప్రయత్నించినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. విషయం పోలీసులకు చేరడంతో వారొచ్చి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 
 
మరో వైపు గ్రామపెద్దలు సమావేశమై ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం కనుగొన్నారు. గంట క్రితం మనువాడిన రెండో భార్యకు విడాకులిచ్చి.. ఆమెను అతని తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని ప్రతిపాదించారు. దీంతో ఎలాంటి సమస్య ఉండదని, ఇద్దరు మహిళలకు న్యాయం చేసినట్టువుతుందని సర్ది చెప్పారు. ఈ సలహా నచ్చడంతో మొదటి భార్య కూడా మిన్నకుండిపోయింది. దీంతో ఒక గంట క్రితం వివాహం చేసుకున్న మహిళకు విడాకులిచ్చిన భర్త.. ఆమెను తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయించాడు. దీంతో పోలీసు కేసుల గొడవ లేకుండానే సమస్య పరిష్కారమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?

అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే !

అలనాటి నటి దేవిక చంపడానికి ట్రైచేసిందన్న భర్త దేవదాస్

కెరీర్ పరంగా గ్యాప్ రాలేదు... లాక్డౌన్ వల్లే ఆ గ్యాప్ : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments