Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భర్త వుండగా ప్రియుడు అవసరమా?

Webdunia
సోమవారం, 11 మే 2020 (10:07 IST)
కట్టుకున్న భర్త వుండగా ప్రియుడు అవసరమా అంటూ.. ఓ సోదరుడు తన చెల్లెలను హత్య చేసిన ఘటన తమిళనాడు మధురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధురై, కీళప్పట్టి ప్రాంతానికి చెందిన మోహన్‌కు శకుంతలతో వివాహమైంది. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల బాబు, ఏడేళ్ల కుమార్తె వుంది. 
 
కానీ ఈ దంపతులు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. దీంతో శకుంతల పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శకుంతల సోదరుడు సౌందరపాండియన్ ఇంటి వద్ద వసించే ఓ వ్యక్తితో శకుంతలకు వివాహేతర సంబంధం నెలకొంది. ఈ విషయం శకుంతల సోదరుడికి తెలియరావడంతో ఆమెను మందలించాడు. 
 
అయినా శకుంతలలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సౌందరపాండియన్.. శకుంతలతో గొడవకు దిగాడు. ఆపై కత్తితో ఆమెను నరికి చంపేశాడు. ఈ ఘటనలో శకుంత ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న సౌందరపాండియన్‌ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments