Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కాచెల్లెళ్లతో ఆడుకున్నాడు... పెద్దమ్మాయితో సహజీవనం, చిన్నమ్మాయితో పెళ్లి

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (17:58 IST)
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ఒక వ్యక్తి ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితాలతో ఆడుకున్నాడు. అక్కతో ఐదేళ్లు సహజీవనం చేసిన యువకుడు ఆమె చెల్లిని రసహ్యంగా వివాహం చేసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
కోల్‌కతాకు చెందిన ఒక యువతికి 2015లో ఒక యువకుడు పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. అనేక ప్రాంతాలు తీసుకెళ్తూ ఐదేళ్ల పాటు యువతిని లైంగికంగా వాడుకున్నాడు. ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. యువకుడి తల్లి సైతం ఆమెపై దాడికి పాల్పడి.. తన కొడుకు జోలికి రావొద్దని హెచ్చరించింది.
 
కొద్దిరోజులుగా యువతితో అన్ని సంబంధాలు తెంచుకున్న యువకుడు ఆదివారం ఆమె చెల్లిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడు, ఆమె తల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు కుటుంబాల నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం