Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి శవాన్ని బైకుపై వేసుకుని తీసుకొచ్చిన ప్రియుడు... ఏం జరిగిందంటే?

కర్నాటకలో ఓ యువతి శవాన్ని బైకుపై వేసుకుని రోడ్డుపై వెళుతున్న యువకుడిని చూసి షాక్ తిన్నారు జనం. అతడు నేరుగా ఆ యువతి శవాన్ని తీసుకుని బళ్లారిలోని పోలీసు స్టేషనుకు తీసుకెళ్లి అసలు విషయం చెప్పాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... 24 ఏళ్ల దావల్ సాబ్ సిర

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (18:50 IST)
కర్నాటకలో ఓ యువతి శవాన్ని బైకుపై వేసుకుని రోడ్డుపై వెళుతున్న యువకుడిని చూసి షాక్ తిన్నారు జనం. అతడు నేరుగా ఆ యువతి శవాన్ని తీసుకుని బళ్లారిలోని పోలీసు స్టేషనుకు తీసుకెళ్లి అసలు విషయం చెప్పాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... 24 ఏళ్ల దావల్ సాబ్ సిరిగేరి గ్రామానికి చెందినవాడు. ఇతడు 21 ఏళ్ల చాకలి హనుమంతి అనే యువతిని ప్రేమించాడు. వీరి మధ్య గత మూడేళ్లుగా ప్రేమాయణ సాగుతోంది. 
 
విషయం ప్రియుడి ఇంట్లో తెలియడంతో వారి పెళ్లికి ససేమిరా అన్నారు అతడి తల్లిదండ్రులు. ఐతే హనుమంతి మాత్రం తనను పెళ్లాడాలని ఒత్తిడి తెచ్చింది. దీనితో ఆమెను బైకుపై ఎక్కించుకుని గ్రామ శివార్లకు తీసుకెళ్లి... నీపై అనుమానం వున్నదనీ, నువ్వు మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావనీ, అందువల్ల తనకు మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయమైందని చెప్పాడు. ఐతే దానికి ఆమె అతడితో వాగ్వాదానికి దిగింది. 
 
దానితో ఆగ్రహంతో... నీవు ఉంటే నా పెళ్లికి అడ్డంకి అందుకే నీవు ఉంటేఉండు లేకపోతే చావు అంటూ కేకలు వేశాడు. దాంతో తన ప్రియుడు లేని జీవితం వ్యర్థమని ఆమె సమీపంలో వున్న చెట్టు చాటుకు వెళ్లి తన పైట చెంగుతో  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెట్టు చాటుకు వెళ్లిన ప్రేయసి ఎంతకీ రాకపోవడంతో అతడు అటుగా వెళ్లి చూస్తే ఆమె శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆమె శవాన్ని కిందికి దించి దాన్ని తీసుకుని నేరుగా అతడు పోలీసు స్టేషనుకు వెళ్లి జరిగినదంతా వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments