Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు ప్రియురాలిని పెళ్లాడిన తండ్రి... ఎందుకో తెలిస్తే షాకవుతారు...

Webdunia
మంగళవారం, 21 మే 2019 (16:03 IST)
కొడుకు ప్రేమించి మోసం చేసిన యువతిని తండ్రి వివాహం చేసుకున్న సంఘటన కేరళలో చోటుచేసుకుంది. కొట్టాయం జిల్లాలోని తిరునక్కారం గ్రామంలో షాజి అనే వ్యక్తి, అతని కుమారుడు కలిసి జీవిస్తున్నారు. అయితే షాజీ కొడుకు ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని కూడా ఆమెకు మాటిచ్చాడు. ఇంతలో తన కొడుకు ప్రేమ విషయం షాజీకి తెలిసింది. 
 
అయితే అప్పటికి వారిద్దరూ మైనర్లు కావటంతో మేజర్లు అయ్యాక ఇద్దరికీ పెళ్లి చేస్తానని షాజీ వారికి హామీ ఇచ్చాడు. వారిద్దరూ మేజర్లయ్యాక షాజీ కుమారుడు మరో యువతిని ప్రేమించాడు. ఇది తెలిసిన మొదటి ప్రియురాలు అతన్ని నిలదీసినా అవేమీ పట్టించుకోకుండా యువతిని గెంటివేశాడు.
 
ఈ విషయం ఊరంతా తెలియడంతో యువతి కుటుంబ సభ్యులు ఊళ్లో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. యువతి తల్లిదండ్రులు కూడా ఆమెను ఇంటి నుంచి గెంటివేసి, తమకు కూతురు లేదంటూ తెగేసి చెప్పారు. ఇంటి నుంచి గెంటివేయబడి ఆ యువతి ఒంటరి కావడంతో షాజీ తన కొడుకుని, అతని మొదటి ప్రియురాలిని కూర్చోబెట్టి వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు. 
 
అయినా ఫలితం లేకపోవడంతో షాజీ బాగా ఆలోచించి, యువతికి న్యాయం చేయాలని భావించి ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీనికి ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు. అంతేకాకుండా తన ఆస్తిని పూర్తిగా ఆమె పేరిటే రాసిచ్చి కొడుక్కి షాక్ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments