Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసకు చిన్నాన్న.. అమ్మాయిపై అత్యాచారం.. మాత్రలిచ్చి గర్భస్రావం..

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (13:31 IST)
వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. మహిళలపై వయోబేధం లేకుండా అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ కామాంధుడైన బాబాయ్ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన తమిళనాడులోని విరుదాచలంలో 15ఏళ్ల బాలికపై చోటుచేసుకుంది. కుమార్తె వరసయ్యే బాలికపై బాబాయ్ అనేక మార్లు దురాగతానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. విరుదాచలంకు చెందిన వల్లియం గ్రామానికి చెందిన వ్యక్తి చిన్నదురై. ఇతని పక్కింటిలో పదో తరగతి చదివే 15 ఏళ్ల బాలిక నివసిస్తోంది. ఆ బాలికకు చిన్నదురై చిన్నాన్న అవుతాడు. తనకు కూతురు వరసయ్యే ఆ బాలికపై చిన్నదురై కన్నేశాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసుకుని.. చిన్నదురై 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయాన్ని బయటికి చెప్తే బాలికకే అవమానమని బెదిరించాడు. ఇలా అనేకమార్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో గర్భం ధరించిన బాలికకు గర్భస్రావం అయ్యేలా మాత్రలిచ్చాడు కామాంధుడు.
 
గత ఏడాది పాటు ఈ అకృత్యం జరుగుతోంది. ఈ వ్యవహారం ఎలాగో బాలిక తల్లిదండ్రులకు తెలియరావడంతో.. వారు పోలీసులకు చిన్నదురైపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నదురైని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments