నాలుగో తరగతి చదివే బాలిక 4వ అంతస్థు నుంచి దూకేసింది.. ఎందుకిలా? (video)

సెల్వి
ఆదివారం, 2 నవంబరు 2025 (15:44 IST)
student
జైపూర్‌లోని నీర్జా మోడీ స్కూల్‌కు చెందిన 6వ తరగతి బాలిక తన పాఠశాల భవనం 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నాలుగో తరగతి చదువుతున్న ఆ అమ్మాయికి ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందని సర్వత్రా చర్చ జరుగుతుంది. 
 
రాజస్థాన్ విద్యా మంత్రి దర్యాప్తు కోసం ఒక బృందాన్ని పంపినప్పుడు, పాఠశాల అధికారులు గంటల తరబడి వారిని లోపలికి అనుమతించడానికి నిరాకరించారు. ఆపై బృందాన్ని లోపలికి అనుమతించారు. అంతలోపే ఆత్మహత్య జరిగిన ప్రాంతాన్ని శుభ్రం చేశారని ఆరోపణలు వున్నాయి. 
 
సీసీటీవీ ఫుటేజ్‌లో బాలిక దూకడానికి ముందు ఆమె వెనుక ఉన్న ఒక వ్యక్తి స్పష్టంగా కనిపిస్తున్నాడు.
 అసలేం జరుగుతుందో అతను ఎలా గమనించలేకపోయాడా అని తెలియాల్సి వుంది. కాగా 4వ తరగతి చదువుతున్న అమయ్రా తన పాఠశాలలోని నాల్గవ అంతస్తు నుంచి దూకి తల గోడకు బలంగా ఢీకొని మరణించింది.
 
ఆమె రైలింగ్ ఎక్కి, కొన్ని క్షణాలు కూర్చుని, ఆపై కింద ఉన్న పొదల్లోకి దూకింది. ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. అమయ్రా తన తండ్రికి ఏకైక కూతురు. ఈ ఘటన నేపథ్యంలో అమయ్రా తండ్రి పాఠశాల యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. పాఠశాల సంఘటన స్థలాన్ని దాచిపెట్టిందని ఆరోపించాడు.
 
పోలీసులు దర్యాప్తు కోసం వచ్చినప్పుడు, ప్రిన్సిపాల్ వారిని లోపలికి అనుమతించలేదు. తలుపులు తాళం వేశాడు. బృందం బయట ఒకటిన్నర గంటలు వేచి ఉంది. 4వ తరగతి చదువుతున్న ఒక బాలిక ఇలా ఆత్మహత్యకు పాల్పడినందుకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments