Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత నా కన్నతల్లి.. శోభన్ బాబు నా తండ్రి.. డీఎన్ఏ పరీక్ష చేసుకోండి : అమృత

తమిళనాడు రాష్ట్రంలో మరో బాంబులాంటి వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. జయలలిత, శోభన్ బాబులు నా తల్లిదండ్రులు అంటూ ఓ యువతి ప్రకటించింది. జయలలిత కూతుర్ని నేనే.. శోభన్‌బాబు, జయ ప్రేమకు చిహ్నం నేను’.. అంటూ ప్

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (10:53 IST)
తమిళనాడు రాష్ట్రంలో మరో బాంబులాంటి వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. జయలలిత, శోభన్ బాబులు నా తల్లిదండ్రులు అంటూ ఓ యువతి ప్రకటించింది. జయలలిత కూతుర్ని నేనే.. శోభన్‌బాబు, జయ ప్రేమకు చిహ్నం నేను’.. అంటూ ప్రకటించారు. కావాలంటే నా డీఎన్ఏ పరీక్షలు చేసుకోవచ్చంటూ ఆమె సవాల్ విసిరి సంచలనం సృష్టించింది. ఆ యువతి పేరు అమృత.
 
ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాట అనేక ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో అమృత చేసిన తాజా ప్రకటన అణు బాంబులా మారింది. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఆమె లేఖ రాశారు. ఈ లేఖలో పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే...
 
"మాజీ ముఖ్యమంత్రి జయలలిత నా కన్నతల్లి. తను తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో శోభన్‌బాబు అండతో కోలుకుంది. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమాప్యాయలతకు గుర్తే నేను. అయితే వివిధ కారణాల వల్ల వివాహం చేసుకోలేదు. దీంతో నన్ను జయ సోదరి శైలజ, భర్త సారథిలకు అప్పగించారు. అయితే నేను ఎవరన్న విషయం ఎవరికీ చెప్పొద్దని వారితో ఒట్టు వేయించుకున్నారు. 1996లో శైలజ సూచన మేరకు జయను కలిస్తే వివరాలు తెలుకుని నన్ను ఒక్కసారిగా హత్తుకున్నారు. అయితే ఆమె నా తల్లి అన్న విషయాన్ని ఆమె ఎప్పుడూ చెప్పలేదు" అని లేఖలో పేర్కొన్నారు.
 
కాగా, జయలలిత మరణం తర్వాత ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్‌లు మీడియా ముందుకొచ్చి తామే జయ వారసులమని చెప్పడం తనను బాధించిందన్నారు. తన తల్లి మరణం వెనక శశికళ, నటరాజన్‌ల పాత్ర ఉందని, ఈ విషయంలో నిజాల నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. అమృత లేఖ తమిళనాడులో పెను సంచలనానికి కారణమైంది. ఇపుడు తమిళనాట అమృత అంశం చర్చనీయాంశంగా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments