Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేశ్యలపై తొమ్మిది మంది సామూహిక అత్యాచారం.. ఫామ్‌హౌస్‌కి తీసుకెళ్లి?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (11:40 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం వేశ్య వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న ముగ్గురు వేశ్యలపై తొమ్మిది మంది గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన బుధవారం నాడు నోయిడాలో చోటుచేసుకుంది.


బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అందరూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కాగా, ఒకరు మాత్రం క్యాబ్ డ్రైవర్ ఉన్నారని తెలిపారు.
 
మంగళవారం రాత్రి లజ్‌పత్‌ నగర్‌ మెట్రోరైల్వేస్టేషన్‌ సమీపంలో క్లైంట్స్‌ కోసం వేచి ఉన్న తమ వద్దకు ఒక స్విఫ్ట్ డిజైర్‌ కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారని, ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నామని, రూ.3600 అడ్వాన్స్‌ కూడా ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత నోయిడా సెక్టార్‌ 135లోని ఓ ఫామ్ హౌస్కు తీసుకెళ్లారని, అంతలోనే అక్కడికి మరో ఏడుగురు వ్యక్తులు రావడం చూసి భయంతో మేము వెళ్లిపోతామని చెప్పినప్పటికీ వారు దానికి ఒప్పుకోకుండా బలవంతంగా అత్యాచారం చేసారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు. 
 
అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరిని బతిమాలితే బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మెయిన్ రోడ్డుపై వదిలిపెట్టాడని, వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు జరిగినదంతా చెప్పామని అన్నారు. అంతేకాకుండా వారు తమకు ఇచ్చిన అడ్వాన్స్‌ను కూడా బలవంతంగా లాక్కున్నారని బాధిత మహిళలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments