Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: బస్సులో మంటలు.. 9 మంది మృతి!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (13:57 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. యూపీలోని అమేథీలో ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగడంతో బస్సులోని 9 మంది సజీవదహనమయ్యారు. అమేథీ జిల్లాలోని పీపరాపూర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి హుటాహుటిని తరలించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేశాయి.
 
మంగళవారం ఉదయం ప్రయాణికులతో బస్సు సుల్తాన్ పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. రాంగాన్ గ్రామ సమీపంలోకి రాగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు చెప్పారు. ఆ సమయంలో బస్సులో 42మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు చెలరేగటంతో కొంతమంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సుల్తాన్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments