Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ శివారు మసీదుల్లో విదేశీ ప్రతినిధులు... ఆచూకీ కనుగొన్న పోలీసులు

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (12:51 IST)
ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మత సమ్మేళనంలో పాల్గొన్న విదేశీ ప్రతినిధుల్లో 800 మందికి పైగా ప్రతినిధుల ఆచూకీ తెలియరాలేదు. దీంతో వారి ఆచూకీని తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసులు కొన్ని బృందాలను ఏర్పాటు చేయగా, ఈ బృందాలు రేయింబవుళ్లు శ్రమించి వారి ఆచూకీని తెలుసుకున్నాయి. 
 
ఈ మర్కజ్ సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ ప్రతినిధులంతా ఢిల్లీ శివారు ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో తలదాచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు అనుమతించాలని పోలీసులు ప్రభుత్వాన్ని కోరారు.
 
తబ్లీగి జమాత్ కార్యాలయం నుంచి ఇప్పటికే 2300 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించిన పోలీసులు.. మరో 600 మంది నగర శివారులోని 16 మసీదుల్లో దాక్కున్నట్టు గుర్తించారు. వారిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించాల్సి ఉంది. 
 
దీంతో మసీదుల్లో తనిఖీలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వీరిలో ఢిల్లీ ఈశాన్య జిల్లాలోని మసీదుల్లో 100 మంది, ఆగ్నేయ జిల్లాలో 200 మంది, దక్షిణ జిల్లాలో 170 మంది, పశ్చిమ జిల్లాలో ఏడుగురు విదేశీయులు దాక్కున్నారని, మిగతా వారిని గుర్తించాలని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
 
కాగా, జమాత్‌లో పాల్గొన్న విదేశీయుల్లో చాలా మందిని గుర్తించినప్పటికీ, కొంతమంది ఆచూకీ చిక్కక పోవడంతో పోలీసులు, ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు వీరి ఆచూకీ కనుగొనడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. 
 
కాగా, న్యూఢిల్లీ మర్కజ్‌లో తగ్లిబీ జమాత్‌ నిర్వహించిన ప్రార్థనలు ఇప్పుడు కరోనా కేంద్రబిందువుగా మారాయి. ఇందులో పాల్గొన్న వేలమందిని కరోనా పాజిటివ్‌లుగా గుర్తించారు. వీరివల్ల ఇంకెంతమంది ఈ మహమ్మారి బారిన పడ్డారనే విషయం ఇప్పుడు పాలకులను ఆందోళనలకు గురిచేస్తున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments