Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల బాలికపై కొడుకు అత్యాచారం.. కేసు పెట్టడంతో కొట్టిచంపేసిన రేపిస్ట్ తండ్రి.. చివరికి ఏమైంది?

ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కొడుకును పోలీసులకు అప్పగించకుండా... రేప్ చేశాడని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో.. తన కుమారుడిచే అత్యాచారానికి గురైన బాలికను కొట్టి చంపిన కిరాతకమై

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (17:33 IST)
ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కొడుకును పోలీసులకు అప్పగించకుండా... రేప్ చేశాడని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో.. తన కుమారుడిచే అత్యాచారానికి గురైన బాలికను కొట్టి చంపిన కిరాతకమైన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి కుమారుడైన యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. జూన్ ఐదో తేదీన బాలికపై పొరుగింట్లోని 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించినట్లు బాధితురాలి కుటుంబీకులు తెలిపారు. ఒత్తిడి మేరకు కంప్లైంట్ తీసుకున్న పోలీసులు గత ఆదివారం 15 ఏళ్ల నిందితుడైన బాలుడిని అరెస్ట్ చేశారు. కానీ రెండు రోజుల తర్వాత బాలుడి తండ్రి.. మరో ఐదుగురితో కలిసి రాత్రిపూట బాలికను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి దారుణంగా కొట్టి చంపేశారు.
 
తన కొడుకును కేసు నుంచి కాపాడేందుకు బాలుడి తండ్రి బాలికను కొట్టి చంపేశాడని, అతడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం పాప మృతదేహాన్ని బుధవారం కుటుంబసభ్యులకు అప్పగించే సమయంలో తీవ్ర ఆందోళనలు జరిగాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చిన్నారి కుటుంబ సభ్యులపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments