Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యానికి కటకట.. ప్రాణం తీసిన హోమియోపతి మందులు.. ఎలా?

Webdunia
గురువారం, 6 మే 2021 (20:28 IST)
చత్తీస్‍‌గఢ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కొందరు గ్రామస్థులు మద్యం లభించకపోవడంతో ఆల్కహాల్ కలిపిన హోమియోపతి మందులను వేసుకున్నారు. దీంతో వారు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగింది. ఇదే ఘటనలో మరో ఐదుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. 
 
ఈ వివాలను పరిశీలిస్తే, జిల్లాలోని సిరిగిట్టి పోలీస్ స్టేషన్ పరిధి కోర్మి గ్రామంలో ఏడుగురిలో నలుగురు మంగళవారం రాత్రి తమ ఇంట్లోనే మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించినట్టు బిలాస్‌పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.   
 
కమలేశ్ ధురి (32), అక్షయ్ ధురి (21), రాజేశ్ ధురి (21), సమ్రు ధురి (25) కలిసి మంగళవారం రాత్రి 91 శాతం ఆల్కహాల్ ఉండే డ్రోసెరా-30 అనే హోమియోపతి సిరప్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత వారు అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు. 
 
వీరు కరోనాతో చనిపోయారని భావించిన కుటుంబ సభ్యులు అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆ తర్వాతి రోజు ఉదయం అంత్యక్రియులు నిర్వహించారు. 
 
ఇదే సిరప్‌ను తీసుకుని అస్వస్థతకు గురైన ఖేమ్‌చంద్ ధురి (40), కైలాశ్ ధురి (50), దీపక్ ధురి (30)లను బిలాస్‌పూర్‌లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు ముగ్గురూ మరణించారు. 
 
సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు అదే సిరప్‌ను తాగి విషమ పరిస్థితిలో ఉన్న మరో ఐదుగురిని ఆసుపత్రులకు తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments