Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాతీ మహారాజ్ ఆశ్రమంలో 600 మంది అమ్మాయిలు ఏమయ్యారు?

రాజస్థాన్‌లోని అల్వాస్‌లో దాతీ మహారాజ్ ఆశ్రమం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివాదాస్పద గురువు దాతీ మహారాజ్ నుంచి సుమారు 600 మంది అమ్మాయిలు అదృశ్యమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దాతీ మహారాజ్ తాను దైవ

Webdunia
ఆదివారం, 17 జూన్ 2018 (13:40 IST)
రాజస్థాన్‌లోని అల్వాస్‌లో దాతీ మహారాజ్ ఆశ్రమం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివాదాస్పద గురువు దాతీ మహారాజ్ నుంచి సుమారు 600 మంది అమ్మాయిలు అదృశ్యమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దాతీ మహారాజ్ తాను దైవాంశ సంభూతడని చెప్పుకునేవాడు. అలాగే తన ఆశ్రమంలో 700 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి ఆలనా పాలనా తానే చూసుకుంటున్నానని పలుమార్లు చెప్పుకునేవాడు. 
 
ఈ నేపథ్యంలో తనపై అత్యాచారం చేశాడని 25 సంవత్సరాల యువతి చేసిన ఫిర్యాదుపై విచారించేందుకు ఆశ్రమానికి వెళ్లిన పోలీసులకు అక్కడ 100 మంది అమ్మాయిలు మాత్రమే కనిపించినట్లు సమాచారం. మిగిలిన అమ్మాయిల సంగతి ఏమైందని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా ఆశ్రమం నుంచి తప్పించుకున్న దాతీ మహారాజ్‌ను వెతుకుతున్నామని పోలీసు అధికారి తెలిపారు. 
 
దాతీ మహారాజ్ తనను దశాబ్ధం పాటు ఆశ్రమంలో బందీ వుంచాడని.. ఆయన, ఆయన అనుచరులు తనను రేప్ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments