Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య గొడవ.. కారులోనే కత్తితో పొడిచాడు.. మరో వ్యక్తితో చనువుగా ఉందని?

భార్యాభర్తల మధ్య గొడవ హత్యకు దారితీసింది. మహిళలపై నేరాలకు అడ్డాగా మారిన దక్షిణ ఢిల్లీలోని ఆనంద్ నికేతన్ ప్రాంతంలో బుధవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో వాగ్వివాదం చేయడంతో విచక్షణ కోల్పోయిన భర్త క

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (12:08 IST)
భార్యాభర్తల మధ్య గొడవ హత్యకు దారితీసింది. మహిళలపై నేరాలకు అడ్డాగా మారిన దక్షిణ ఢిల్లీలోని ఆనంద్ నికేతన్ ప్రాంతంలో బుధవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో వాగ్వివాదం చేయడంతో విచక్షణ కోల్పోయిన భర్త కత్తితో ఆమెను పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే.. కారులో వెళుతుండగా మంజు మోంగా(58)కు ఫోన్ వచ్చిందని, ఆమె ఎక్కువసేపు ఫోన్‌లో మాట్లాడుతుండగా భర్త ముఖేశ్ అడ్డుచెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. 
 
కోపంతో ఊగిపోయిన ముకేశ్(60) కత్తితో పొడిచి భార్యను హతమార్చాడని పోలీసులు వెల్లడించారు. కారులో పారిపోయేందుకు ప్రయత్నించిన ఆయనను ఛేజ్ చేసి పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. 30 ఏళ్ల క్రితం ముకేశ్, మంజులకు పెళైందని.. కూతురు, కొడుకుతో కలిసి తూర్పు ఢిల్లీలోని హరినగర్ లో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. 
 
మరో వ్యక్తితో మంజు చనువుగా ఉండడం, తన సమక్షంలోనే అతడితో ఫోన్ మాట్లాడుతుండడం తట్టుకోలేక ముకేశ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. భార్యను చంపాలని అతడు ముందుగా కుట్ర పన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడికి తాగుడు అలవాటు ఉందని, ఇంట్లోలోనూ భార్యను హించించేవాడని పొరుగింటివారు చెప్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments