Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో ఊపిరాడక మరణించిన బాలుడు.. నాలుగు రోజుల తర్వాతే గుర్తించారు.. ఎక్కడ?!

గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఘోరం జరిగింది. అపార్ట్‌మెంట్లలో ఉండే తల్లిదండ్రులు ఆ బిడ్డను ఆడుకుంటున్నాడని తేలిగ్గా వదిలేశారు. ఫలితం చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (17:08 IST)
గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఘోరం జరిగింది. అపార్ట్‌మెంట్లలో ఉండే తల్లిదండ్రులు ఆ బిడ్డను ఆడుకుంటున్నాడని తేలిగ్గా వదిలేశారు. ఫలితం చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

వివరాల్లోకి వెళితే.. కారులోపల పొరపాటున తాళం పడి ఊపిరాడక ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సూరత్ నగరంలో గల ఒక అపార్ట్‌మెంట్లో నిలిపివుంచిన కారులోకి ప్రవేశించిన ఆ బుడతడు.. ఆట్లాడుతూ.. కారు తలుపుల్ని లాక్ చేసుకున్నాడు. 
 
ఆపై ఆ డోర్లను తీయడం అతనికి వీలుకాలేదు. కారు అద్దాలు సైతం మూసేసి వుండటంతో లోపల చిక్కుకున్న ఆ కుర్రాడు ఊపిరాడక మరణించాడు. ఆడుకుంటున్న తమ బిడ్డ ఇలా మృత్యువు బారిన పడటం చూసిన అతని తల్లితండ్రులు రోధించారు. హృదయవిదారకమైన ఈ సంఘటన అక్కడి నిఘా కెమేరాలో రికార్డైంది. 
 
అయితే.. ఆడుకుంటున్న తమ బిడ్డ కనిపించలేదని జూన్ 13వ తేదీ సూరత్‌లోని సచిన్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. కానీ పార్కింగ్ ఏరియాలో నిల్చున్న కారు నుంచి దుర్వాసన రావడంతో జై వైభవ్ విల్లా అపార్ట్‌మెంట్ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారు తెరిచి చూస్తే బాలుడి మృతదేహం కుళ్ళిన స్థితిలో లభ్యమైంది. 
 
ఆ బాలుడు తమ బిడ్డేనని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన తల్లిదండ్రులు విలపించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాకే కారులోకి తెలియకుండా ప్రవేశించిన బాలుడు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments