Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆ ఐదు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు.. మందులు సిద్ధం

Webdunia
బుధవారం, 26 మే 2021 (20:14 IST)
భారతదేశం సెకండ్ వేవ్ కరోనాతో పోరాడుతుండగా.. మరో‌వైపు కొత్త ఫంగస్‌లు టెన్షన్ పెడుతూ ఉన్నాయి. దేశంలో ఐదు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్‌లో 2,859 కేసులు, మహారాష్ట్రలో 2,770, ఏపీలో 768 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 11,717 కేసులు నమోదయ్యాయి.
 
బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కోరుతున్నట్లుగా బ్లాక్ ఫంగస్ చికిత్సలో వినియోగించే మందులను ప్రాధాన్యతాక్రమంలో కేటాయించింది.

మ్యూకోర్మైకోసిస్ చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందించింది. మహారాష్ట్ర, ఢిల్లీ, యుపీ, ఏపీ లలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సదరు రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్నాయి. 
 
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాలు యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్లను కేటాయించాలంటూ కేంద్రాన్ని కోరాయి. 29వేల 250 యాంఫోటెరిసిన్-బి వయల్స్ పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయిస్తూ మే 26న ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments