Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. కాశ్మీరేతరులే టార్గెట్‌.. 15 రోజుల్లో 11 మంది మృతి

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (11:41 IST)
కాశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. కాశ్మీరేతరులే లక్ష్యంగా ఉగ్రమూకలు దాడులకు పాల్పడుతున్నాయి. మంగళవారం పుల్వామాలో సిఆర్‌పిఎఫ్‌ క్యాంప్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన అగస్టు ఐదో తేదీ నుంచి కాశ్మీరేతలరుపై దాడులు చేయడం ఇది ఏడోసారి. గత 15 రోజుల్లో 11 మంది కాశ్మీరేతరులను ఉగ్రవాదులు కాల్చిచంపారు.
 
మంగళవారం కాశ్మీరేతరులైన ఐదుగురు కూలీలను కుల్గామ్‌ జిల్లాలోని కాట్రాసులో ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రంగా గాయాలైనాయి. వీరంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముర్షిదాబాద్‌ ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు. 
 
మొత్తం తొమ్మిది మంది కూలీలు వారి షెడ్‌లో ఉండగా ఉగ్రవాదులు వాళ్లని బయటకు లాగి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అక్కడికక్కడే ఐదుగురు చనిపోయారు. వీరంతా భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. సోమవారం నాడు అనంతనాగ్‌ జిల్లాలో కాశ్మీరేతరుడైన ఒక ట్రక్‌ డ్రైవర్‌ను కాల్చి చంపారు. అంతకు ముందు వేర్వేరుచోట్ల మరో ముగ్గురు ట్రక్‌ డ్రైవర్లను ఉగ్రవాదులు కాల్చి చంపారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments