Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులకు 5 రోజులు సెలవులు

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (08:00 IST)
బ్యాంకు ఖాతాదారులూ జర జాగ్రత్త! ఈ నెల 26 నుంచి 30 వరకూ వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు బంద్‌ కానున్నాయి. ఈ నెల 26వ తేదీ గురువారం నుంచి రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మె చేస్తామని బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి.

ఆ తర్వాత 28వ తేదీ నాలుగో శనివారం, 29 ఆదివారం. ఆ రెండు రోజులూ బ్యాంకులు పని చేయవు. ఇక, ఈ నెల 30న బ్యాంకులకు అర్ధ సంవత్సర ముగింపు రోజు. ఆ రోజూ లావాదేవీలు ఉండవు. అక్టోబరు ఒకటో తేదీన బ్యాంకులు పని చేయనున్నాయి.

ఆ వెంటనే అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. బ్యాంకుల సమ్మె, అర్ధ సంవత్సర ముగింపు రోజుల్లో నెఫ్ట్‌ లావాదేవీలు ఉన్నా.. బ్యాంకుల్లో నగదు లావాదేవీలు ఉండవు. అంటే బ్యాంకు యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు వెళితే.. వరుసగా ఐదు రోజులపాటు వ్యాపార, నగదు లావాదేవీలు మాత్రమే కాదు.. ఉద్యోగుల జీతాలకూ ఇబ్బంది తప్పదు!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments